, 2017-11-22, Wednesday
language : தமிழ்
Breaking News
  •   

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ దీపావళి సందర్భంగా తమ హ్యాపీ మూమెంట్స్‌ను షేర్ చేసుకుంది. గత మార్చిలో ఎన్నారై బిజినెస్‌మేన్ అయిన కళ్యాణ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీజ భర్తతో కలిసి సంతోషకరమైన జీవితం కొనసాగిస్తోంది. దీపావళి సందర్భంగా భర్త కళ్యాణ్, కూతురు నివ్రుతి(మొదటి వివాహం వల్ల జన్మించిన బిడ్డ)తో కలిసి దిగిన ఫోటోను షోషల్‌మీడియాలో శ్రీజ షేర్ చేసింది. ముగ్గురూ కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఇదే తొలిసారి. శ్రీజ భర్త కళ్యాణ్ త్వరలో హీరోగా తెరంగ్రేటం చేసే అవకాశం ఉంటుందని ఇప్పటికే ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఆయన నటన, ఇతర అంశాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం. కళ్యాణ్ లుక్ కూడా సినిమా హీరోకు తగ్గట్టుగానే ఉంటుంది. అంతేకాక మెగా ఫ్యామిలీ సపోర్టు, మెగా అభిమానుల అండ కూడా ఉంది కనుక... దానికి కాస్త టాలెంట్ కూడా చేరితే మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు.

Videos