, 2017-11-22, Wednesday
language : தமிழ்
Breaking News
  •   

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం, భార‌తీయ జ‌న‌తా పార్టీలపై హైద‌రాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మ‌రోసారి మండిప‌డ్డారు. ప్ర‌జలు క‌ట్టిన ప‌న్నుల‌ను మ‌త సంబంధిత విష‌యాల‌కు ఉప‌యోగించ‌కూడ‌ద‌ని సుప్రీంకోర్టు చెప్పిందని, అయిన‌ప్ప‌టికీ అయోధ్య‌లో 100 మీటర్ల పొడ‌వైన రాముడి విగ్ర‌హాన్ని నిర్మిస్తామ‌ని యూపీ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఇది కోర్టు విధించిన నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌డ‌మేన‌ని అన్నారు. ఓవైపు ప్ర‌జ‌ల సొమ్మును ప్రార్థ‌నా మందిరాల పున‌ర్నిర్మాణం, మరమ్మతుల‌కు ఉప‌యోగించ‌కూడ‌ద‌ని కోర్టు స్ప‌ష్టంగా చెబితే, మ‌రోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ రాముడి విగ్ర‌హ నిర్మాణానికి ఎలా ఉప‌యోగిస్తార‌ని అసదుద్దీన్ ఒవైసీ ప్ర‌శ్నించారు.

ఇటీవ‌ల అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌ను మెచ్చుకున్న అంశంపై స్పందించిన అస‌దుద్దీన్ ఒవైసీ... ట్రంప్‌ని మోదీ కౌగిలించుకోని మ‌రీ వ‌చ్చార‌ని, ఇప్పుడు అమెరికా త‌న నిజ‌మైన తీరుని బ‌య‌ట పెట్టింద‌ని అన్నారు. అంతేగాక‌, భార‌త్‌లోని బానిసత్వంతో పాటు గౌరీ లంకేశ్ హ‌త్య కేసు గురించి, కంచ ఐల‌య్యకు వ‌స్తోన్న బెదిరింపుల‌ గురించి అమెరికా ప్ర‌శ్నించింద‌ని విమ‌ర్శించారు.

Videos