, 2017-10-20, Friday
language : தமிழ்
Breaking News
  •   

ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ హీరోగా తెలుగులో విజయవంతమైన 100% లవ్ చిత్రం తమిళంలో తెరకెక్కుతుంది. తెలుగు దర్శక నిర్మాత సుకుమార్ ఈ చిత్రాన్ని తన ప్రొడక్షన్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభం చెన్నైలో ఘనంగా జరిగింది. దీనికి చంద్రమౌళి దర్శకత్వం వహిస్తుండగా అర్జున్ రెడ్డి చిత్ర కథానాయిక మనీషాపాండే ఈ చిత్రంలో జీవీ ప్రకాష్ కు జోడి కడుతుంది. చెన్నైతోపాటు పొల్లాచ్చి తదితర ప్రాంతాలలో ఈ చిత్రం తెరకెక్కుతుందని, సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ చిత్రనికి కథానాయకుడిగా నటిస్తున్న జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తుండటం గమనార్హం.

Videos