, 2017-10-20, Friday
language : தமிழ்
Breaking News
  •   

 చెన్నైలోని రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మద్రాసు హైకోర్టు ఛీప్ జస్టిస్ ఇందిరా బెనర్జీ గవర్నర్ బన్వరీలాల్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పళణిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, నగర ప్రముఖులు హాజరయ్యారు. గవర్నర్ గా రోశయ్య పదవీకాలం ముగిశాక మహారాష్టర గవర్నర్ విద్యాసాగర్ రావు అదనపు బాద్యతలు నిర్వహిస్తూ వచ్చారు. గత కొన్నినెలలుగా ఖాళీగా ఉన్న తమిళనాట కొత్త గవర్నర్ పై తీవ్రస్థాయిలో కసరత్తులు చేయగా పలువురు తెలుగు ప్రముఖుల పేర్లు వినిపించాయి. అనంతరం అస్సాం గవర్నర్ గా ఉన్న బన్వరీలాల్ ను తమిళనాడు గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి ఆదేశాలు జారిచేశారు. దీంతో గురువారం సాయంత్రం చెన్నై చేరుకున్న ఆయనకు రాష్ట్రప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. శుక్రవారం ఉదయం రాజ్ భవన్ లో బన్వరీలాల్ గవర్నర్ గా పదవీబాధ్యతలు స్వీకరించగా ఆయనకు అధికార, ప్రతిపక్షాలతోపాటు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు.

Videos