, 2018-07-23, Monday
language : தமிழ்
Breaking News

గుజరాత్‌ అల్లర్లపై జాకియా జాఫ్రీ వేసిన పిటీషన్‌ను ఇవాళ ఆ రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లలో నరేంద్ర మోదీతో పాటు మరి కొందరు అధికారులకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది సిట్‌. అయితే ఆ తీర్పుకు వ్యతిరేకంగా జాకియా జాఫ్రీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మరో ఉన్నత కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు జాకియాకు సూచించింది. గుజరాత్‌లో జరిగిన అల్లర్లలో కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ ఇశాన్‌ జాఫ్రీ ప్రాణాలో కోల్పోయారు. ఆయన భార్యే జాకియా జాఫ్రీ. గుజరాత్‌ అల్లర్ల కేసులో సిట్‌ ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా ఆమె పిటిషన్‌ వేశారు. మోదీతో పాటు మొత్తం 59 మందిపై క్రిమినల్‌ కేసు దాఖలు చేయాలని జాకియా తన అభ్యర్థనలో డిమాండ్‌ చేశారు. గోద్రా ఘటన తర్వాత గుజరాత్‌లో జరిగిన అల్లర్లకు అప్పటి మోదీ ప్రభుత్వమే కారణమని ఆమె తన పిటిషన్‌లో ఆరోపించారు. గోద్రాలో రైలుకు నిప్పు పెట్టిన ఘటన తర్వాత 2002, ఫిబ్రవరి 28న భారీ హింస చోటుచేసుకున్నది. ఆ మరుసటి రోజు గుల్‌బర్గ్‌ సొసైటీలో జరిగిన దాడిలో కాంగ్రెస్‌ నేత ఇశాన్‌ జాఫ్రితో పాటు మరో 68 మంది ప్రాణాలు కోల్పోయారు.

Videos