, 2017-12-16, Saturday
language : தமிழ்
Breaking News
  •   

ప్రముఖ నటి, జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి ఇటీవల ముస్తఫా రాజ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో ఆమె వివాహం జరిగింది. పెళ్లయ్యాక తొలిసారి ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పెళ్లి గురించి, తన భర్త ముస్తఫా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘చెప్పాలంటే మేమిద్దరం వైవాహిక జీవితానికి ఇంకా అలవాటుపడలేదు. ఎందుకంటే పెళ్లైన మూడో రోజే షూటింగ్‌కు వెళ్లిపోయాను. ముస్తఫాకూడా నన్ను ఈ విషయంలో అర్థం చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. పెళ్లయ్యాక భార్య ఇంట్లో కూర్చోవాలి అని చెప్పే టైప్‌ కాదు నా భర్త. డేటింగ్‌లో ఉన్నప్పటి నుంచి పరస్పరం నిజాయతీగా, వాస్తవికంగా ఉన్నాం.’

సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ సమయంలో ముస్తఫాని చూశాను. కానీ అది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ కాదు. ముందు ఇద్దరం స్నేహితుల్లా ఉన్నాం. ఆయన నన్ను చిన్నపిల్లలా చూసుకోవడం, కేర్‌ తీసుకోవడం నచ్చింది. అలా ఇద్దరం మనసులు ఇచ్చిపుచ్చుకున్నాం. అయితే పెళ్లికి తక్కువ మందిని ఎందుకు ఆహ్వానించారు అని చాలా మంది అడుగుతున్నారు. అందుకు ఓ కారణం ఉంది. పెళ్లికి కొద్దిరోజుల ముందే మా బంధువు ఒకరు చనిపోయారు. అందుకే హడావుడి చేయాలనుకోలేదు.’

‘నిశ్చితార్థం అయ్యాక మా ప్రేమ గురించి మీడియాకు చెప్పినప్పుడు ముస్లింని వివాహం చేసుకుంటున్నందుకు నెటిజన్లు చాలా కామెంట్స్‌ చేశారు. ఇది నేను ముందే వూహించాను. నా ప్రేమ విషయం మీడియాకు ఎందుకు చెప్పానంటే.. నా సంతోషాన్ని అభిమానులతో పంచుకోవడానికి. అంతేకానీ ముస్తఫాని పెళ్లి చేసుకోవాలా? వద్దా? అని అనుమతి తీసుకోవడానికి కాదు.’

‘జీవితంలో నాకు భర్త, అతని కుటుంబీకులే ముఖ్యం. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. పెళ్లయ్యాక కూడా సినిమాలు చేస్తాను. ఇందుకు ఆయన కూడా పూర్తి మద్దతు తెలిపారు. ఆఫీస్‌లో పని లేకపోతే ఆయన నా షూటింగ్‌ సెట్స్‌కు కూడా వస్తుంటారు.’అని చెప్పుకొచ్చారు ప్రియమణి.

Videos