, 2017-10-20, Friday
language : தமிழ்
Breaking News
  •   

 ప్రముఖ ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ ప్లానింగ్ అండ్ డిజైన్ కు  ప్యాడ్ గ్రో సంస్థ 40 వార్షికోత్సవం చెన్నైలో ఘనంగా జరిగింది. నలబై ఏళ్ల సంస్థ ఫలితాలు, ప్రయోగాలు, నూతన నిర్మాణాలను ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యం తమ అనుబంధ సంస్థలు, వినియోగదారులతో పంచుకున్నారు. చెన్నైలోని ఆంధ్రాక్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో 40 సంవత్సరాల సంస్థ వార్షికోత్సవ కేక్ ను కట్ చేసి వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాజరై  నగర ప్రముఖులు ముందుగా జ్యోతి ప్రజ్వలనతో వేడుక ప్రారంభమైంది. ముందుగా అతిధులను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి వేడుకకు ఆహ్వానించగా ఆయన సతీమణీ బార్గవి, కుమారుడు రాందేవ్ నిశ్చల్, సంహితలు కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సంస్థ విజయాలు, బీఎస్ మూర్తి వ్యక్తిత్వం గురించి ప్రశంసించారు. ప్రదానంగా బీఎస్ మూర్తికి చెందిన ప్యాడ్ గ్రో సంస్థ విజయాల్లో అంతర్జాతీయ విజేతగా నిలిపిన బారీ ప్రాజెక్ట్ లపై అతిధులు ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా బీఎస్ మూర్తి మీడియాతో మాట్లాడుతూ.. 40ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలు, ఎన్నో సవాళ్లను అధికమించామని చెప్పారు. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాజెక్ట్ ల నిర్మాణంలో సవాళ్లను, ప్రైవేట్ ప్రాజెక్ట్ ల నిర్మాణాలలో వినూత్న ప్రయోగాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినట్లు తెలిపారు. ఇటీవల దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాదిపై స్మారక మందిర నిర్మాణం డిజైన్ ప్రభుత్వాన్నే ఆశ్చర్యపరిచేలా చేసిందన్నారు. ఎన్నో డిజైన్లు వచ్చినా తమ ప్రాజెక్ట్ నెంబర్ వన్ గా నిలవటం తమకు అనందం కలిగించిందన్నారు. ఇక అంతర్జాతీయ స్థాయిలో నిపుణులు మనకు అందుబాటులో ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిన్ డిజైనర్ల చుట్టూ తిరగటం బాధ కలిగించిందన్నారు. ఇక్కడి సాంకేతిక నిపుణులు ప్రపంచాన్ని జయిస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీయుల సాయం కోరటం ఎంత వరకు సమంజసమని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో మరెన్నో వినూత్న ప్రాజెక్ట్ లతో ప్యాడ్ గ్రో ను అంతర్జాతీయస్థాయిలో నిలపటమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు బీఎస్ మూర్తి ఆశాబావం వ్యక్తం చేశారు.

Videos