, 2017-12-16, Saturday
language : தமிழ்
Breaking News
  •   

మరోసారి జై లవ కుశ, స్పైడర్ లాంటి సినిమాలు పోటి పడుతున్న దసరా సీజన్ లో మహానుభావుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వానంద్. భలే భలే మొగాడివోయ్, బాబు బంగారం లాంటి సినిమాలతో ఆకట్టుకున్న మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మహానుభావుడు.  ఆనంద్ (శర్వానంద్) ఓసీడీ ( అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) అనే వ్యాధితో ఇబ్బంది పడే సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతి శుభ్రత, అతి నీట్‌ నెస్ ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి కారణంగా తాను ఇబ్బంది పడటంతో పాటు ఇతరులను కూడా ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. ఆనంద్ తల్లి, కజిన్ (వెన్నెల కిశోర్) లు కూడా ఆనంద్ ప్రవర్తనతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆనంద్, మేఘన (మెహరీన్) తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు.

తన వ్యాధి గురించి చెప్పకుండా తనను ఇంప్రెస్ చేసి ప్రేమలో పడేస్తాడు. అయితే మేఘన మాత్రం తన తండ్రి రామరాజు (నాజర్)కి నచ్చితేనే నిన్ను ప్రేమిస్తానని ఆనంద్ కు కండిషన్స్ పెడుతుంది. పల్లెటూరి నుంచి వచ్చిన మేఘన తండ్రితో ఆనంద్ ఫ్రీగా ఉండలేకపోతాడు. రామరాజు కూడా తన కూతురికి ఆనంద్ కరెక్ట్ కాదని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ పరిస్థితుల్లో ఆనంద్ రామరాజు కుటుంబానికి ఎలా దగ్గరయ్యాడు...? మేఘన ప్రేమను ఎలా గెలుచుకోగలిగాడు..? ఆనంద్ వ్యాధిని అతడి ప్రేమ ఎలా జయించింది..? అన్నదే మిగతా కథ. ఓసీడీ అనే ఇబ్బందికర వ్యాధితో బాధపడే పాత్రలో శర్వానంద్ మంచి నటన కనబరిచాడు. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మెహరీన్ రీ ఎంట్రీలో ఆకట్టుకుంది. గ్లామర్ షోతో పాటు నటిగానూ మంచి మార్కులు సాధించింది. వెన్నెలకిశోర్ మరోసారి తనదైన కామెడీ టైమింగ్ తో అలరించాడు. సినిమా అంతా హీరో వెంటే ఉండే పాత్రలో నవ్వులు పూయించాడు. హీరోయిన్ తండ్రిగా నాజర్ హుందాగా కనిపించారు. కూతురి ప్రేమను గెలిపించేందుకు తపన పడే తండ్రిగా ఆయన నటన ఆకట్టుకుంటుంది.

TSN రేటింగ్ : 3/5

Videos