, 2017-10-20, Friday
language : தமிழ்
Breaking News
  •   

 తమిళనాడులోని ప్రఖ్యాత విశ్వవిద్యాయాలు పలు విద్యా ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో తైవాన్ ప్రభుత్వం,ప్రైవేట్ కు చెందిన ఏడు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో చెన్నైలోని మద్రాసు ఐఐటి, వేల్ టెక్ విశ్వవిద్యాలయం ఈ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. తైవాన్ విశ్వవిద్యాలయాల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, బిజినెస్ మేనేజ్ మెంట్ కోర్సులకు సంబందించి నాణ్యతమైన విద్యను అందించమే ధ్యేయంగా ఈ ఒప్పందాలు కుదిరినట్లు విశ్వవిద్యాలయాల యాజమాన్యాలు తెలిపారు. ప్రధానంగా అంతర్జాతీయ విద్యా ప్రమాణాలు కలిగిన తైవాన్ విశ్వవిద్యాలయాలతో ఒప్పందం ద్వారా భారతీయ, ప్రధానంగా తమిళనాడులోని ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలోని విధ్యార్ధులు విద్యాబ్యాసానికి పరిశోధనలకు సంబధించిన అవగాహన, ప్రత్యేక పరిజ్ఞానం పొందుతారని వేల్ టెక్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు శకుంతల రంగరాజన్ తెలిపారు. తమ విశ్వవిద్యాలయంలో అధికంగా తెలుగు విద్యార్ధులు ఉండటం వారికి తైవాన్ ఒప్పందాలను కోర్సులను శిక్షణ ఇచ్చేందుకు ఈ ఒప్పందాలు ప్రోత్సాహకంగా ఉంటాయని ఆమె వివరించారు.

Videos