, 2017-10-20, Friday
language : தமிழ்
Breaking News
  •   

ప్రముఖ విమర్శకులు కంచె ఐలయ్యపై ఆర్యవైశ్యులు మండిపడుతున్నారు. సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పేరుతో కంచె ఐలయ్య  రాసిన పుస్తకంపై చెన్నైలో పలు కేసులు నమోదు ఆయ్యాయి. ఆయనపై చర్యలు తీసుకోవటంతోపాటు పుస్తకాన్ని నిషేదించేంత వరకు దేశవ్యాప్త ఆందోళనలకు సిద్దమవుతున్నట్లు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) ప్రకటించింది. ఇప్పటికే ఐలయ్యపై నాలుగు కేసులు నమోదు చేసిన వామ్ చెన్నైలో ఆయనకు వ్యతిరేకంగా వివిధ ప్రాంతాల్లోని పోలీస్టేషన్లలో కేసులు, దిష్టి బొమ్మ దగ్ధం చేసేందుకు సిద్దమవుతున్నారు. దీనిపై ప్రసంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరు రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆర్ధికాభివృద్ధిలో వైశ్యుల పాత్ర కీలమని అన్నారు.

అటువంటి వైశ్యులను స్మగ్లర్లు అంటూ సంబోదించటమే కాకుండా కోమటోళ్లు అంటూ తమ జాతిని కించపరిచే విధంగా పుస్తకం రాయటం తమ మనోభావాలు దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐలయ్యకు ఇలా జాతులు, కులాల వారికి విమర్శలు దిగటం అలవాటేనని దుయ్యబట్టారు. ఆయన బుధ్దిచెప్పే విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైశ్యులు ఏకతాటికి వస్తున్నారని, ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో దేశవ్యాప్తం పోరాటాలకు సిద్దమవుతామని హెచ్చరించారు.

Videos