, 2017-12-16, Saturday
language : தமிழ்
Breaking News
  •   

తమిళనాట ఎన్నికల్లో తెలుగు పార్టీ పోటీ పడుతోంది. అయితే ఇది ఆంద్ర తెలంగాణాలకు చెందిన పార్టీ కాదు.. తమిళనాట మూడేళ్ల కిందట ఆవిర్భవించిన తెలుగు వారి పార్టీ. అదే తమిళనాడు తెలుగు మక్కల్ కట్చి. అంటే టిటిఎంకె. తమిళనాడులోని తెలుగువారి కోసం కోయంబత్తూరు కేంద్రంగా ఆవిర్భమైంది తమిళనాడు తెలుగు మక్కల్ కట్చి (టిటిఎంకె). గత మూడేళ్లుగా తమిళనాడులోని తెలుగు సంఘాలన్నింటినీ ఏకం చేసే ప్రయత్నంతోపాటు తెలుగు వారి సమస్యలపై పోరాడుతున్న టిటిఎంకె ఆర్కే నగర్ పై దృష్టిసారింది. ఇప్పటి వరకు మారుతూ తెలుగువారి సహకారంతో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్న ద్రవిడ పార్టీలు తెలుగు వారికి మాత్రం తీరని అన్యాయం చేస్తున్నారన్నది టిటిఎంకె ప్రధాన ఆరోపణ. ఇందులో భాగంగా తమిళనాట ఉన్న 40 శాతం తెలుగు వారిని ఏకం చేసే ప్రయత్నంలో సామాజిక వర్గాలు, ప్రాంతాలు, తెలుగు సంఘాలు అంటూ అందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం మొదలు పెట్టింది. నిర్భంధ తమిళం మూలంగా తమిళనాట అంతరిస్తున్న తెలుగు బాష కాపాడుకునే ప్రయత్నం కూడా మొదలు పెట్టింది. తమిళనాట స్థిరపడిన తెలుగువారందరూ తమ మాతృబాషలోనే విద్యాబ్యాసం చేసుకునే నిరంతర తీర్పుకోసం టిటిఎంకె పోరాడుతోంది. ఇందులో భాగంగానే ఎన్నికలప్పుడు తమను వాడుకుని వదిలేసే తమిళ ద్రవిడ పార్టీల నేతలకు ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తెలుగు వారి సత్తా చాటేందుకు నడుం బిగించింది. అంతేకాదు.. ఆర్కే నగర్ నియోజకవర్గంలో ఉన్న 1 కోటి 61 లక్షల కోట్ల ఓటర్లు ఉండగా ఇందులో 1 కోటి 10 లక్షల మంది ఓటర్లు తెలుగు వారే. దీంతో తెలుగు వారి సాయంతోనే గత 40 ఏళ్లుగా అధికారం చేపడుతున్న ద్రవిడ పార్టీలకు ధీటుగా తెలుగు వారి సత్తా చాటాలనే ప్రయత్నం టిటిఎంకె చేస్తోంది. ఇందులో భాగంగా తమ పార్టీ మహిళా అభ్యర్ధి లలిత మోహన్ ను రంగంలోకి దింపింది. చదరంగం గుర్తుతో బరిలో ఉన్న లలిత మోహన్ ఆర్కే నగర్ లోని తెలుగు వారందరినీ ఒక్కతాటిపై తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇదిలావుండగా ధనబలం, అధికార బలంతో ముందుకు దూసుకెళుతున్న ద్రవిడ పార్టీకు ఓటేస్తే తెలుగు వారికి చిరునామా లేకుండా చేస్తారంటూ ప్రచారం చేస్తున్న లలిత మోహన్ తెలుగు వారందరూ తనకే ఓటెయ్యాలని అభ్యర్ధిస్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ఆమెకు తెలుగు వారి నుండి మద్దతు లభిస్తోంది. అదే ఇప్పుడు ద్రవిడ పార్టీలైన అమ్మా అన్నాడిఎంకె, అన్నాడిఎంకె  పురట్చి తలైవి అమ్మా, ద్రవిడ మున్నేట్ర కళగం అభ్యర్ధులు కొంత తెలుగు ఓటర్లు సంకటంతో పడేసే పరిస్థితి ఏర్పడింది. పన్నీరు సెల్వం వర్గానికి చెందిన మధుసూధనన్ స్థానికుడు కావటం, అందులో తెలుగు వాడు కావటం అన్నాడిఎంకె పురట్చి తలైవి అమ్మా పార్టీకి కొంత లాభిస్తుండగా అన్నాడిఎంకెలో ఏర్పాడ్డ చీలికల కారణంగా టిటివి దినకరన్ కు ఆ నియోజకవర్గంలో కొంత ఎదురుగాలి వీస్తోంది. అదే సమయం ఒకపక్క ఎంజీఆర్ జానకి దీపా పేరవై నుండి పోటీ చేస్తున్న దీపా వలన కూడా అన్నాడిఎంకె చీలిక వర్గాలకు ఓటర్లు చీలే అవకాశం ఉండటంతో ఇక్కడి నుండి డిఎంకె తరపున బరిలో ఉన్న మరుదు గణేష్ కు లాభదాయకమయ్యే పరిస్థితులున్నట్లు విశ్లేషకులు బావిస్తున్నారు. ఈ నేపధ్యంలో తమిళనాడు తెలుగు మక్కల్ కట్చి ఏ మేరకు రాణిస్తుంది. అసలు ఈ పార్టీకి బలమెంత, బలహీనతలేమిటి, తెలుగు వారి వద్దకు టిటిఎంకె దూసుకెళుతుందా అనేందుకు 12న జరిగే ఎన్నికలే పరమావధిగా నిలవనున్నాయి.

సంబందిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Videos