, 2017-12-16, Saturday
language : தமிழ்
Breaking News
  •   

శ్రీహరికోటలోని సతీశ్‌ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలార్‌ ఉపగ్రహ వాహక నౌక-సీ39 (పీఎస్‌ఎల్వీ) ప్రయోగం విఫలమైంది. 29 గంటల కౌంట్‌డౌన్‌ ప్రక్రియ అనంతరం గురువారం సాయంత్రం సరిగ్గా 7 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్‌ నుంచి ఉష్ణకవచం వేరుపడలేదు. దీంతో ప్రయోగం విఫలమమైందని ఇస్రో ఛైర్మన్‌ కిరణ్‌కుమార్‌ ప్రకటించారు. ఇందుకు గల కారణాలను విశ్లేషిస్తామని తెలిపారు. సాంకేతిక కారణంగానే హీట్‌షీల్డ్‌ విడిపోలేదని పేర్కొన్నారు. నావిగేషన్‌ వ్యవస్థకు సంబంధించి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1 హెచ్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఈ రాకెట్‌ ప్రయోగం చేపట్టారు. ఇందుకు గాను బుధవారం మధ్యాహ్నం 2 గంటలకే కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. నావిగేషన్‌ వ్యవస్థ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది. ఇందులో 2013లో పంపిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఏ ఉపగ్రహంలోని మూడు పరమాణు గడియారాలు మొరాయించి సేవలందడం లేదు. దాని స్థానంలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1హెచ్‌ను పంపేందుకు ఉద్దేశించిన రాకెట్‌ ప్రయోగం విఫలమైంది.

Videos