, 2017-12-16, Saturday
language : தமிழ்
Breaking News
  •   

ఉత్తర కొరియా దుందుడుకు వైఖరికి కళ్లెం వేసేందుకు అగ్రరాజ్యం అమెరికా సన్నాహాలు మొదలు పెట్టింది. హవాయి తీరంలో అమెరికా వాయుసేన, క్షిపణి భద్రతా ఏజెన్సీ (ఎండీఏ)లు బుధవారం ఖండాంతర క్షిపణి పరీక్ష నిర్వహించాయి. యూఎస్‌ఎస్‌ జాన్‌ పాల్‌ జోన్స్‌ నౌక నుంచి దీనిని నిర్వహించారు. జపాన్‌ మీదుగా మంగళవారం ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన సంగతి తెలిసిందే. దానికి ప్రతిచర్యగానే ఈ పరీక్ష చేపట్టినట్టు సమాచారం. ప్రస్తుతం అమెరికా పరీక్షించింది మధ్యతరహా ఖండాంతర క్షిపణి.

అమెరికాపై అణుబాంబులు వేయగలమని చాలా రోజులుగా ఉత్తర కొరియా దుందుడుకు వ్యాఖ్యలు చేస్తోంది. అమెరికా మిత్రదేశాలైన దక్షిణ కొరియా, జపాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తామని బెదిరిస్తోంది. ఈ క్రమంలోనే క్షిపణి ప్రయోగాలు చేసింది. మంగళవారం ఏకంగా జపాన్‌ మీదుగా క్షిపణిని ప్రయోగించింది. పసిఫిక్‌ తీరంలోని గువామ్‌ ద్వీపాన్ని నాశనం చేస్తామని ఉత్తర కొరియా పదేపదే అంటోంది. ‘అలా చేస్తే ప్రపంచ పటంలో మీ దేశం లేకుండా చేస్తాం’ అని అమెరికా ఘాటుగా బదులిచ్చినసంగతి తెలిసిందే.

Videos