, 2017-10-20, Friday
language : தமிழ்
Breaking News
  •   

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను కాషాయపరం చేసే కుట్రలకు కేంద్ర సహకరిస్తుందని ఆయన మండిపడ్డారు. చెన్నైలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..దక్షినాదిని ఆక్రమించుకునేందుకు బీజేపీ పంచలు బిగించుకుని వస్తుందని, ఇక్కడ బీజేపీ పప్పులు ఉడకవని అన్నారు. ఫిరాయింపులపై బీజేపీ చట్టాలు చేస్తామనటం ఆ పార్టీ ధ్వంధవైఖరికి నిదర్శనమని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో టిడిపితో కుమ్మైకైన బీజేపీ చట్టాలు చేస్తామనం హాస్యాస్పదంగా ఉందన్నారు. వెంకయ్యనాయుడు బావిలో కప్పవంటివాడని విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల స్పీకర్లు ప్రభుత్వ తొత్తులుగా మారారని దుయ్యబట్టారు. స్వతహాగా ఒక్క నిర్ఱయం కూడా తీసుకోలేని చేతగాని వారిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే యోగి ఆదిత్యదాస్ వైఖరి అసలే కోతి, అపై కల్లుతాగి నిప్పుతొక్కినట్లు పైత్యం పెరిగిందని విమర్శించారు. ఆడవాళ్లు అసభ్యంగా తిరిగితే అందరూ ఖండిస్తారని, అయితే ప్రభుత్వ ముసుగులో గతంలో భజరంగ్ దళ్ ఆడవారిపై దాడులు చేయగా ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు దమ్ముంటే పదివేల మందితో రాసలీలలాడిన శ్రీకృష్ణుడిని రోమియో అని, శ్రీకృష్ణుడితీరు ఖండించి తదుపరి ఉత్తరప్రదేశ్ లో రోమియోలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనులన్నీ పనికిమాలినవేనని నారాయణం ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 సంబందిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Videos