, 2017-10-20, Friday
language : தமிழ்
Breaking News
  •   

ప్పుడో 1957లో అంటే 60 ఏళ్ల కిందట ఒక్కటిగా చదువుకున్బ తెలుగు విద్యార్థులు వృద్దాప్యంలో కలుసుకొని చిననాటి సంగతులు నెమరువేసుకున్నారు.ఇదంతా చెన్నైలోని రామకృష్ణ మిషన్ పాఠశాల శారదా బాలికల స్కూల్లో చోటు చేసుకుంది. 60 ఎళ్ల కిందట రామకృష్ణ మిషన్ బాలురు, శారద స్కూలు బాలికలు ఒక్కటిగా చదువుకున్న వారంతా చేసుకున్న షష్టిపూర్తి.

ఇందులో 60 నుండి 45 సంవత్సరాల కిందటి వరకు చదువుకున్న శారదా స్కూలు పూర్వ విద్యార్థుల కలయికలో మగవారుకూడా కలుసుకోవటం గమనార్హం. 60 ఏళ్ల కిందట దర్శకుడు రాఘవేంద్రరావుతో కలిసి చదువుకున్న వారు కూడా ఇందులో పాల్గొన్నారు. శారద స్కూలులో జరిగి ఈ పూర్వ విద్యార్థుల కలయికలో దాదాపు 100 మంది పాల్గొన్నారు. ప్రదానంగా  ఘంటసాల, గోటేటి, కొవ్వలి, నటుడు నాగభూషణం, హాస్యనటుడు బాలకృష్ట తదుతర నటులు, చెన్నై నగరంలొ తెలుగు వారి పిల్లలు ఇక్కడే చదువుకునేవారు.

అప్పట్లో మద్రాసు నగరంలో తెలుగు ప్రదాన మాధ్యమాలుగా ఉన్న రెండు పాఠశాలలో కెసరి, శారద, రామకృష్ణ స్కూళ్ళలో మాత్రమే ఉండేది. అప్పుడు సినిమా ఇండస్ట్రీ కూడా చెన్నైలో ఉండటంతో అంతా ఈ పాఠశాల్లోనే ఒక్కటిగా చదువుకునేవారు. విద్యాభ్యాసం ముగించుకుని ఎక్కడెక్కడో ఉన్నవారంతా మళ్లీ శారదా స్కూల్లో  కలుసుకుని కబుర్లు చెప్పుకోవటం తెలుగువారిలో కొత్త ఉత్సాహాన్నిచ్చింది.

Videos