, 2018-08-18, Saturday
language : தமிழ்
Breaking News

చిత్రం : ‘రారండోయ్ వేడుక చూద్దాం’

నటీనటులు: అక్కినేని నాగచైతన్య - రకుల్ ప్రీత్ - జగపతిబాబు - సంపత్ - కౌసల్య - వెన్నెల కిషోర్ - చలపతిరావు - బెనర్జీ - అన్నపూర్ణ - పోసాని కృష్ణమురళి - పృథ్వీ - సప్తగిరి - తాగుబోతు రమేష్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: విశ్వేశ్వర్
స్క్రీన్ ప్లే: సత్యానంద్
నిర్మాత: నాగార్జున అక్కినేని
కథ - మాటలు - దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ కురసాల

కథ:

శివ (నాగచైతన్య) ఒక బిలియనీర్ కొడుకు. అతను తన అన్నయ్య పెళ్లి కోసమని ఓ పల్లెటూరికి వెళ్లి.. అక్కడ భ్రమరాంభ (రకుల్ ప్రీత్)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆ వేడుక జరిగినన్ని రోజులూ తన వెంటే తిరుగుతాడు. తిరిగి సిటీకి వచ్చే సమయానికి.. భ్రమరాంభ కూడా తన చదువు కోసం సిటీకే వస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. ఐతే తండ్రి కోరిక ప్రకారం ఆయన చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఉన్న భ్రమరాంభ.. శివను ఓ స్నేహితుడిలాగే చూస్తుంది. మరోవైపు శివ.. భ్రమరాంభ కుటుంబాల మధ్య విభేదాలున్న సంగతి కూడా తర్వాత బయటపడుతుంది. మరి ఈ పరిస్థితుల్లో శివ.. భ్రమరాంభ మనసు ఎలా గెలిచాడు.. ఇరు కుటుంబాల్ని ఒప్పించి ఆమెను తన సొంతం ఎలా చేసుకున్నాడు అన్నది మిగతా కథ.

రారండోయ్ వేడుక చూద్దాం...

ఫ్యామిలీ సినిమా కు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారని , అందరు ఆ దారిలోనే వెళ్తున్నారు...
ఫ్యామిలీ సినిమా అంటే సినిమా లో కాసేపు పెళ్లి సీన్స్ పెట్టి హడావిడి చేయడం కాదు..

నాకు తెలిసి రెగ్యులర్ గా సినిమాలు చూసేవాడు , సినిమా ల మీద అవగహన ఉన్న వాళ్ల కి ఈ వేడుక అసలు నచ్చదు..గంగా మిక్స్ లో పాత కథల్ని వేసేసి దానికి ఫ్యామిలీ డ్రామా అని పెట్టిసీ తీసిన సినిమా ఎలా చూస్తాం...భూతద్దం వేసుకుని చూసిన సినిమా మొత్తం లో ఒక కొత్త సీన్ కూడా కనపడదు.. సినిమా మొత్తా నికి కీలకమైన భ్రమరాంబ పాత్ర కోసం రకుల్ ని డైరెక్టర్ కురసాల కళ్యాణ్ కృష్ణ గారు ఎందుకు తీసుకున్నారో ఆయనకే తెలియాలి.. .చైతూ కంటే 4 ఏళ్ళు పెద్దది గా ఉన్న రకుల్ ఆ పాత్రకు అసులు సూట్ కానీ కాలేదు.అమాయకత్వం ఉట్టి పడేలా ఉండే పల్లెటూరి అమ్మాయి పాత్ర లో రకుల్ నటన కంటే ..ఓవర్ యక్షన్ ఎక్కువగా ఉంది..
మొదటి సినిమా ను బాగా మెప్పించిన కళ్యాణ్ కృష్ణ ..రెండవ ( ద్వితీయ) విజ్ఞానాన్ని దాట లేకపోయాడు..
మొదటి సినిమాకు మూల కధను రామ్ మోహన గారు ఇచ్చినప్పటికి , అద్భుతమైన స్క్రోన్ ప్లే తో ఆకట్టుకున్నాడు.. కాని రెండవ సినిమా లో కథ కూడా తానే రాసుకోవడం వల్ల , కొత్త వాటి జోలికి వెళ్లకుండా పాత వాటికే పూత రాసాడు..
మొత్తానికి పెద్ద కొడుక్కి బ్లాక్ బస్టర్ ఇద్దామనుకున్న నాగార్జున గారి కోరిక ఈ సినిమా తో అయితే తీరలేదు అని మాత్రం చెప్పొచ్చు...
చివరిగా నిన్నే పెళ్లాడతా లాగా ఉంటుందని మొదటి నుండి ప్రచారం చేసి చివరకు ఆ సినిమా ను మార్చి తీసేసారు..అలాంటి పాత సినిమాలు ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం వరకు బాగానే ఉన్నా , వాటిని తీసేసి దానికి కొత్త పేరు పెట్టడం ఎందుకో..దానికి కొనసాగింపు గా 2 అనో 3 అనో చెప్తే అందరు ముందే ప్రిపేర్ అయి వెళ్తారు కదా...

సినిమా చూసాక నా అభిప్రాయం ఇది..

TSN

Videos