, 2017-10-20, Friday
language : தமிழ்
Breaking News
  •   

తెలుగింటి సీత‌మ్మ‌, రాజోలు చిన్న‌ది అంజ‌లి త‌మిళ హీరో జైని ప్రేమిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదివ‌ర‌కే పెళ్లి కూడా చేసుకుంద‌న్న ప్ర‌చారం సాగింది. అంతేకాదు .. ఈ ఇద్ద‌రూ చెన్న‌య్‌లోని ఓ హోట‌ల్లో స‌హ‌జీవ‌నం చేస్తున్నారు.. అంటూ ప్ర‌చారం సాగింది. పెళ్లి గురించి ఈ ఇద్ద‌రినీ ప్ర‌శ్నించినా ఇన్నాళ్లు దాగుడుమూత‌లు ఆడారు. ఇటీవ‌లే ఈ ఇద్ద‌రూ ఓపెన్ అయ్యారు. చెన్న‌య్‌లో ఒకే ఫ్లాట్‌లో ఉంటున్న ఈ జంట ఫోటోల్ని ఎవ‌రో లీక్ చేయ‌డంతో ఆ బండారం కాస్తా బ‌య‌ట‌ప‌డింది. నాటి నుంచి కాస్త డేరింగ్‌గానే ఈ ఇద్ద‌రూ క‌లిసి ఉన్న‌ప్ప‌టి ఫోటోల్ని సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేస్తూ ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు. అంతేకాదు .. మ‌రో ముంద‌డుగు వేసి ఈ జంట పెళ్లి ముచ్చ‌ట గురించి క్లారిటీనిచ్చారు. ప్ర‌స్తుతం ఉన్న క‌మిట్‌మెంట్లు అన్నీ పూర్తి చేసుకుని వ‌చ్చే ఏడాది పెళ్లి బంధంతో ఏక‌మ‌వుతామ‌ని హీరో జై ఓ హింటిచ్చాడు. ఇప్ప‌టికే స‌హ‌జీవ‌నం క‌న్ఫామ్ చేశారు. పెళ్లి వ‌చ్చే ఏడాది అని క్లూ ఇచ్చారు. ఇక పెళ్లి కార్డు కూడా ఇచ్చే టైమ్ వ‌చ్చేస్తోంద‌ని చెబుతున్నారు. మొత్తానికి అంజ‌లి- జై పెళ్లికి లైన్ క్లియ‌ర‌వుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. కాక‌పోతే మ‌ధ్య‌లో అంజ‌లి బాబాయ్‌- పిన్ని క్యారెక్ట‌ర్లు ఎంట్రీ ఇవ్వ‌వు క‌దా?

Videos