, 2017-12-16, Saturday
language : தமிழ்
Breaking News
  •   

కోయంబత్తూరు నుంచి ముగ్గురు మహిళలు లండన్‌కు కారు యాత్ర చేపట్టారు. కోవైకి చెందిన మీనాక్షి అరవింద్‌, పొల్లాచ్చి వాసి మూకాంబికా రత్నం, ముంబయికి చెందిన ప్రియా రాజ్‌పాల్‌ ఈ ప్రయాణానికి సిద్ధమయ్యారు. ‘ఎక్స్‌పీడీ 2470’ పేరిట చేపట్టిన యాత్రను మంత్రి వేలుమణి ఆదివారం జెండా వూపి ప్రారంభించారు. కోవై రోటరీ క్లబ్‌లు, శ్రీ రామకృష్ణా గ్రూప్స్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కోవై కలెక్టర్‌ హరిహరన్‌, అవినాశిలింగం వర్సిటీ కులపతి కృష్ణకుమార్‌, రోటరీ సంఘం అధ్యక్షుడు బ్రిజేష్‌, రూట్స్‌ సంస్థల అధినేత కె.రామస్వామి; రామకృష్ణ, ఎస్‌ఎన్‌ఆర్‌ గ్రూప్‌ల నిర్వాహక ట్రస్టీ విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రయాణం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించిన శ్రేయోభిలాషులు, విద్యార్థులు, ప్రజలు వారిని ఉత్సాహంగా సాగనంపారు. పలు దేశాలమీదుగా వెళ్లి జూన్‌ ఐదో తేదీ లండన్‌కు వీరు చేరుకోనున్నారు.

Videos