, 2017-10-20, Friday
language : தமிழ்
Breaking News
  •   

నరసింహ సినిమాలో నీలింబారిగా మెప్పించి.. బాహుబలి సిరీస్‌లో శివగామిగా నటించి ప్రేక్షకుల, సినీ విమర్శకుల మనసులను కొల్లగొట్టిన నటి రమ్యకృష్ణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాహుబలి-2 ఘన విజయం తరువాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రమ్యకృష్ణ తన రాజకీయ రంగ ప్రవేశంపై స్పందించింది. ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అది జరుగుతుందని, ఒకవేళ రాజకీయాల్లోకి రావాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందని చెప్పింది. తాను రాజకీయాల్లోకి రావడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందంటే వస్తానేమో అని వ్యాఖ్యానించింది. అయితే రాజకీయాల్లోకి రాకుండా కూడా మంచిపనులు చేయొచ్చునన్న రమ్యకృష్ణ, భవిష్యత్‌లో ఏం జరుగుతుందోనని చూద్దాం చెప్పుకొచ్చింది. బాహుబలి సినిమా తనకు మంచి గుర్తింపు తీసుకువచ్చిందని రమ్యకృష్ణ సంతోషం వ్యక్తం చేసింది.

Videos