, 2017-12-16, Saturday
language : தமிழ்
Breaking News
  •   

బాహుబలి 2లో ఇంటర్వెల్‌ సీన్‌కి పవన్‌కళ్యాణ్‌ స్ఫూర్తి అని చెప్పిన రచయిత విజయేంద్రప్రసాద్‌, అలా జనం పవన్‌ గురించి నినాదాలు చేస్తూ వుంటే ఇతర హీరోలు అసూయ పడతారని కూడా అన్నారు. బాహుబలి పాత్రకి జనం జేజేలు పలుకుతోంటే, భల్లాలదేవుడు అసూయ పడే సన్నివేశాన్ని పవన్‌ స్ఫూర్తిగానే రాసుకున్నానని విజయేంద్రప్రసాద్‌ చెప్పారు. దీంతో 'చెప్పను బ్రదర్‌' అంటూ పవన్‌ అభిమానుల సందడిని వ్యతిరేకించిన అల్లు అర్జున్‌ని గురించే ఆ సీన్‌ అలా రాసారని, అంతగా పవన్‌ క్రేజ్‌ చూసి కుళ్లుకున్న హీరో ఇంకెవరు వున్నారని పవన్‌ ఫాన్స్‌ బన్నీని టీజ్‌ చేస్తున్నారు. భల్లాలదేవుడి గెటప్‌లో బన్నీని చూపిస్తూ మీమ్‌లు తయారు చేసి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. అయితే ఆ సన్నివేశానికి వేరే ఏదో ఆడియో ఫంక్షన్‌లో జరిగిన సంఘటన స్ఫూర్తి కాదని, బాహుబలి ఆడియో వేడుక తిరుపతిలో చేసినపుడు అడివి శేష 'పంజా' గురించి మాట్లాడుతూ పవన్‌ ప్రస్తావన తెచ్చినపుడు అక్కడ సభాప్రాంగణం హోరెత్తిపోయిందని, అసలు ఒక వ్యక్తిపై ఇంత అభిమానమేంటని అనిపించిందని, తర్వాత ఒకట్రెండు ఆడియో వేడుకల్లోను అది కనిపించినపుడు, ఇదే లైన్స్‌లో బాహుబలి ఇంటర్వెల్‌ సీన్‌ రాస్తే ఎలా వుంటుందనిపించి, ఇప్పుడున్న సీన్‌ రాసుకున్నానని ఆయన స్పష్టతనిచ్చారు. ఇది ఫలానా హీరోని ఉద్దేశించిన సన్నివేశం కాదని సాక్షాత్తూ రచయితే స్పష్టం చేసినప్పటికీ ఆ హీరోతో వున్న వైరం కారణంగా భల్లాలదేవుడు అతడేనంటూ అభిమానులు ఫిక్స్‌ అయిపోయారు

Videos