, 2018-07-23, Monday
language : தமிழ்
Breaking News

నేను రెండు నెలలు మీడియాలో పనిచేశాను. కానీ.. మీడియాను హ్యాండిల్ చేయటం నాకు తెలియదు. కేవలం మిమ్ములను కలిసేందుకే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను. నేను రాజకీయాలకు కొత్త, మీ సపోర్టు లేకుండా ఏమీ చేయలేను. ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించండి. నాకు పెద్ద బాద్యత ఉంది. అందరికీ బాద్యత ఉన్నాయి. ఇప్పుడు నేను చేయబోయేది స్వాతంత్ర్య పోరాటం వంటి ఓ ప్రజాస్వామ్య పోరాటం. తమిళనాడులో ప్రస్తుత పరిస్థితుల్లో చాలా విషయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఓ రాజకీయ మార్పు కావాలి. వీలైనంత త్వరగా పార్టీని స్టార్ చేయాలని నా ఆశ. ప్రస్తుత యువత అదే ఎదురు చూస్తున్నారు.తప్పకుండా మీ సహకారం లేనిదే నేను ఏది సాధించలేను. పూర్తివివరాలు, మీ ప్రశ్నలన్నింటికి త్వరలో సమాదానం చెపుతాను అని రజనీ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆరురోజులపాటు అభిమాన సంఘాల సమావేశాలను కవర్ చేసిన మీడియా మిత్రులతో ఫోటోలు దిగారు.

Videos