, 2018-04-26, Thursday
language : தமிழ்
Breaking News

లక్ష్మీ పార్వతి జీవిత కథ ఆధారంగా 'లక్ష్మీస్ వీరగ్రంథం'ను తెరకెక్కిస్తున్న దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మరో సంచలనానికి తెరతీయనున్నారు. జయలలిత-శశికళ జీవితాలపై 'శశిలలిత' అనే సినిమాను తీయనున్నానని ఆయన స్వయంగా ప్రకటించారు. అంతేకాదు ఆ చిత్రాన్ని తానే నిర్మించనున్నట్లు కూడా చెప్పారు.ప్రస్తుతం దానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. జయలలిత జీవితంలోకి సేవకురాలిగా ప్రవేశించిన శశికళ ఆ తరువాత ఎలా చక్రం తిప్పారనే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నానని కేతిరెడ్డి తెలిపారు.

అలాగే జయలలిత ఆసుపత్రిలో చేరినప్పటినుండి చనిపోయేవరకు ఏం జరిగిందో కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నానని పేర్కొన్నారు. ఈ సినిమా తీస్తే తన అంతుచూస్తానంటూ ఇప్పటికే మన్నర్ గుడి మాఫియా హెచ్చరించిందని, కానీ నన్ను ఏ శక్తి అడ్డుకోదని చెప్పారు. ఇక 'లక్ష్మీస్ వీరగ్రంథం'లో పూజా కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తుందని చెప్పుకొచ్చారు. అయితే జయలలిత-శశికళ జీవితంపై సినిమా తీస్తానని మరోవైపు రామ్ గోపాల్ వర్మ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.

 

Videos