, 2018-07-23, Monday
language : தமிழ்
Breaking News

కత్తి మహేష్ మరోమారు పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యేలా కనిపిస్తున్నాడు. పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం ప్రిరిలీజ్ ఫంక్షన్ 19వ తేదీన జరుగనుంది. జనవరి పదో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. కత్తి మహేష్ ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయ్యాడు. పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పిస్తూ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా 'అజ్ఞాత‌వాసి' గురించి కూడా విమ‌ర్శ‌లు చేశాడు. ఈ చిత్రం ఓ హాలీవుడ్ సినిమాకు కాపీ అని అర్థం వ‌చ్చేలా పోస్ట్ పెట్టాడు. 2008లో వచ్చిన హాలీవుడ్ సినిమా 'లార్జో వించ్' అనే సినిమా ట్రైల‌ర్‌ను త‌న ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసి.. "ఎందుకైనా మంచిది.. ఈ సినిమాను బాగా చూసి గుర్తు పెట్టుకోండి" అంటూ ఓ కామెంట్ పెట్టాడు. దీనిపై అపుడే పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Videos