, 2017-12-16, Saturday
language : தமிழ்
Breaking News
  •   

ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విశాల్  సోమవారం నామినేషన్ దాఖలు చేయటంతో ఈ పోరు సర్వత్రా వేడి రాజుకుంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష సభ్యులు నామినేషన్లు దాఖలు చేయగా శశికళ వర్గం నుండి దినకరన్ బరిలోకి దిగారు. ఇక చివరి రోజు కావటంతో సోమవారం నామినేషన్లు వేసేందుకు స్వతంత్ర అభ్యర్థులతోపాటు వివిద పార్టీల అభ్యర్థులు క్యూ కట్టారు. ఇందులో నటుడు విశాల్ తో పాటు, బీజేపి నుండి కరు.నాగరాజన్, జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ లు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ప్రతిష్టాత్మకమైన ఆర్కే నగర్ ఉప ఎన్నిక పంచముఖ పోటీగా మారింది. అత్యదికంగా ఉన్న తెలుగు ఓటర్లు టార్గెట్ గా రసవత్తరమైన ఈ ఎన్నిక బరిలో ఉన్న అభ్యర్థులు అందరికి ప్రతిష్టాత్మకం కానుంది. అధికార ప్రతిపక్షాలు ఎలా ఉన్నా విశాల్, దీపా జయకుమార్, టిటివి దినకరన్, కరు.నాగ రాజన్ లకు ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి.

ఇక నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన విశాల్ అధికార ప్రతపక్షాలు విఫలం కావటమే నా పోటీకి కారణం అన్నారు. అంతేకాదు స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి తెలుగు, తమిళ బేదం లేకుండా తనకు మద్దతివ్వాలని కోరటం అప్పుడే విశాల్ కు రాజకీయాలు వంటబట్టినట్లు ఉన్నాయని విశ్లేషకులు బావిస్తున్నారు. ఇక దీపా జయకుమార్ తనదే విజయం అంటూనే విశాల్ ఎన్నికల రాకను స్వాగతించారు. అంతేకాదు కేంద్ర ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు అధికార ప్రభుత్వానికి పార్టీని, గుర్తును ఇవ్వటం ద్వారా ఈసీ వారికి సానుకూలంగా వ్యవరించిందని ఆరోపించారు. ఇక అధికార, ప్రతిపక్ష సభ్యులు ఎవరికివారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారానికి సిద్దమవుతున్నారు. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, నడిగర్ సంఘం కార్యదర్శిగా రాజీనామా చేయకుండా విశాల్ నామినేషన్ వేయటాన్ని నిరసిస్తూ దర్శకుడు చేరన్ నిర్మాతల మండలి కార్యాలయంలో ఆమరణ నిరహారదీక్షకు దిగారు.

Videos