, 2017-12-16, Saturday
language : தமிழ்
Breaking News
  •   

వీ స్టూడియోస్‌, పీజీ మీడియా నిర్మిస్తున్న చిత్రం ‘మదురవీరన్‌’. వీజీ సుబ్రహ్మణియన్‌ నిర్మిస్తున్నారు. కెప్టెన్‌ విజయకాంత్‌ కుమారుడు షణ్ముగపాండియన్‌ హీరోగా నటిస్తున్నారు. సముద్రకని కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా తొలి సింగిల్‌ ట్రాక్‌ను తాజాగా ఆవిష్కరించారు. గ్రామీణ పదాలతో విప్లవాత్మకంగా ఈ పాట రాశారు రచయిత యుగభారతి. సంతోష్‌ దయానిధి సంగీతం సమకూర్చారు. ‘కొల్లై అడిచ్చవన్‌ కూట్టుల.. నమ్మ కుడుంబం నిక్కుదు రోట్టుల..’ అంటూ ఈ పాట సాగుతోంది. ‘శతాబ్దం’ చిత్రంతో షణ్ముగపాండియన్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపునివ్వలేదు. ఆయన నటిస్తున్న రెండో చిత్రం ‘మదురవీరన్‌’. ఈ సినిమాతో తప్పకుండా ప్రేక్షకుల హృదయాల్లో నిలుస్తారని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

Videos