, 2017-12-16, Saturday
language : தமிழ்
Breaking News
  •   

సంగీత దర్శకుడిగా హవా చాటుకున్న జీవీ ప్రకాష్‌ ప్రస్తుతం హీరోగా ప్రత్యేకత కనబరుస్తున్న విషయం తెలిసిందే. బాలా దర్శకత్వంలో ‘నాచ్చియార్‌’లో ఆయన ఇప్పుడు నటిస్తున్నారు. ఇందులో జ్యోతిక పోలీసు అధికారిణి పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ ఇటీవల విడుదలై చర్చనీయాంశంగా మారింది. ఇళయరాజా సంగీతం సమకూర్చుతున్నారు. ఇందులోని ఓ యుగళ గీతాన్ని నటుడు జీవీ ప్రకాష్‌ పాడారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ‘ఇళయరాజా సంగీతంలో నేను పాడటం ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇళయరాజాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ పాటను తమిళచ్చి తంగపాండియన్‌ రాశారు. ‘ఉన్నై విట్టాల్‌ యారుం ఇల్ల..’ అంటూ సాగే ఈ పాటను జీవీతో పాటు సూపర్‌సింగర్‌ ఫేమ్‌ ప్రియాంక పాడారు. సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు. బాలా నిర్మాణంలోని బీ స్టూడియోస్‌ బ్యానరుపై తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Videos