, 2017-12-16, Saturday
language : தமிழ்
Breaking News
  •   

చెన్నైతో నా అనుబంధం విడదీయలేనిదని మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గుర్తు చేసుకున్నారు. తెలుగు వారి ఆత్మీయ సభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ మరియు ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ నిర్వహించిన ఈ సభలో నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. సభకు ఆస్కా అధ్యక్షుడు పల్లవ కె.సుబ్బారెడ్డి, ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ, నగర ప్రముఖులు జెకె రెడ్డి, అజంతా శంకరరావు, నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్, రిటైర్డ్ ఐఏఎస్ ఎస్ ఏ రాజ్ కుమార్, నారాయణ గుప్త తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ.. కొంత విరామం తర్వాత చెన్నైలోని తెలుగు వారందరినీ మళ్లీ ఇలా కలుసుకోవటం ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్ లో ఉంటున్నా.. నా సొంత ఊరు ఎదని అడిగితే చెన్నై అని చెప్పేంత అనుబంధం ఏర్పడిందన్నారు. ఇక్కడి తెలుగు వారెప్పుడూ అప్యాయతలను పంచటంలో ముందుంటారని అన్నారు.

అందరు సంతోషంగా ఉండాలని దీవించారు. ఈ సందర్భంఎగా ఆస్కా తరపున డాక్టర్ కె సుబ్బారెడ్డి, ఉంగళకాగ ట్రస్ట్ సునిల్ రెడ్డిలు రోశయ్యను గజమాలతో సత్కరించగా చెన్నైలోని ప్రముఖులంతా శాలువాలతో పుష్పగుచ్చాలతో రోశయ్యను గౌరవించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రోశయ్య ఎక్కడి ప్రభుత్వాలపై అందరితో కలిసి ముందుకు వెళితే మంచే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు అందరినీ కలుపుకొనిపోతే ఏ సమస్యలు ఉండవని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాల తీరుపై అవగాహన లేకుండా నేను మాట్లాడటం మంచి పద్దతి కాదని చెప్పారు. తమిళనాడులో ప్రస్తుత పరిణామాలపై తాను ఏమి మాట్లాడలేనని తెలిపారు. అందరూ బాగుండాలి. నాకీ వయస్సులో మళ్లీ రాజకీయాలపై అంత ఆసక్తి లేదని, పెద్ద మనిషిగా ఎవరైనా సలహాలు, సూచనలు అడిగితే నాకు తోచింది చెపుతానని అన్నారు.

Videos