, 2017-12-16, Saturday
language : தமிழ்
Breaking News
  •   

ఆర్‌  స్టూడియోస్‌ బ్యానరుపై రాధికా శరత్‌కుమార్‌, విజయ్‌ ఆంటోని ఫిలిం కార్పొరేషన్‌ బ్యానరుపై ఫాతిమా విజయ్‌ ఆంటోని సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అన్నాదురై’. విజయ్‌ ఆంటోని హీరోగా నటిస్తున్నారు. ఆయనే సంగీతం సమకూర్చారు. ఎడిటర్‌ కూడా ఆయనే కావడం విశేషం. శ్రీనివాసన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ నెల 30వ తేదీన సినిమా విడుదలకానుంది. మిక్సర్‌ బాక్స్‌ కంపెనీ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సత్యం థియేటర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు భాగ్యరాజ్‌, అభిరామి రామనాథన్‌, దర్శకుడు వసంతబాలన్‌, తెలుగు నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌, నటుడు ఉదయనిధి, దర్శకురాలు కృత్తిక ఉదయనిధి, నిర్మాత జ్ఞానవేల్‌రాజా, శరత్‌కుమార్‌, రాధిక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధికా శరత్‌కుమార్‌ మాట్లాడుతూ ‘జీవితంలో శ్రమ, నిజాన్ని మాత్రమే నమ్ముకున్నా. ఏ విషయానికీ భయపడింది లేదు. ఎవరు సాయం కోరినా.. రాత్రనక, పగలన వెళ్లి సహాయం చేసిన వ్యక్తి శరత్‌కుమార్‌. ఈ సినిమా కథను శ్రీనివాసన్‌ చెప్పినప్పుడు దీనికి విజయ్‌ ఆంటోని అయితే కరెక్టు అనుకున్నా. ఓ సారి ఆయనకు కథ చెప్పమని సూచించా.

విజయ్‌ ఆంటోని కథ విని నా కోసం నటించడానికి ఒప్పుకున్నారు. పలువురు నిజాయతీపరుల శ్రమ ఈ సినిమా. విజయ్‌ అని పేరుంటేనే చాలా సున్నితంగా ఉంటారు. అది విజయ్‌ అయినా, విజయ్‌ ఆంటోని అయినా అంతే. ‘సూర్యవంశం’ మాదిరిగా పాజిటివ్‌ చిత్రమిది’ అని పేర్కొన్నారు. అనంతరం భాగ్యరాజ్‌ మాట్లాడుతూ ‘విజయ్‌ ఆంటోనిని ప్రేక్షకులు అన్నాదురై స్థాయికి తీసుకెళ్లారు. సూపర్‌స్టార్‌, సుప్రీంస్టార్‌, మెగాస్టార్‌లందరికీ పునాది అభిమానులే. అవల్‌, అరం వంటి చిన్న చిత్రాలు పెద్ద విజయాలను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. విజయ్‌ ఆంటోనికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. తప్పకుండా ఈ సినిమా కూడా విజయం సాధిస్తుంది’ అని పేర్కొన్నారు. అనంతరం విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ ‘ఒక వేదికపై మరొకరి కోసం రెండు, మూడు గంటలు వెచ్చించడం సాధారణమైన విషయం కాదు. అలా నా కోసం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నాకు దక్కిన ప్రతి విజయం.. నా ఒక్కడి ఆస్తి కాదు.. సమష్టి కృషి’ అని పేర్కొన్నారు.

Videos