, 2017-12-16, Saturday
language : தமிழ்
Breaking News
  •   

రుతుపవనాల ప్రభావంతో చెన్నైతోపాటు తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 48 అతి భారీ వర్షాలతో కుంభవృష్టి కురుస్తుందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శ్రీలంక-గల్ఫ్ ఆప్ మన్నారు నడుమ కేంద్రీకృతమైన అల్పపీడనం తూర్పు బంగాళాఖాతం దిశగా కదులుతుండటం రుతుపవనాలు వేగంగా మారి భారీ వర్షాలకు దారీతీస్తోందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తీరప్రాంతాల్లోని చెన్నై, కాంచిపురం, తిరువళ్లూరు, కడలూరు, కన్యాకుమారి, తూత్తుకుడి జిల్లాల్లో బారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో తమిళనాడులోని సీర్గాళీలో 31 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదుకాగా చెన్నైతోపాటు పరిసర ప్రాంతాల్లో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 48 గంటలు భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించటంతో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వర్షం కారణంగా నగరంలోని పలు రహదారులు, కాలనీలు చెరువుల్లా తలపించాయి. రవాణా వ్యవస్త తీవ్రస్థాయిలో దెబ్బతింది. జీవనం అస్తవ్యస్తంగా మారటంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివకే ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించగా వర్షం కారణంగా సహాయక చర్యలకు ప్రత్యేక విభాగాలను ఏర్పటు చేసి సిబ్బందిని సిద్దంగా ఉంచింది. వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపధ్యంలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన జాలర్లు ఒడ్డుకు చేరుకున్నారు. తమ పడవులను, వలలను ఒడ్డున చేర్చటంతో ఎన్నూరు, రాయపురం ప్రాంతాల్లోని ఫిషింగ్ హార్బర్స్ వెలవెలపోతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన వర్షపునీటిని తొలగించే పనుల్లో ఇప్పటికే ప్రభుత్వం సిబ్బందిని అప్రమత్తం చేసినా ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తుండటంతో నగరవాసులు గృహాలను వదిలి బయటకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Videos