, 2017-12-16, Saturday
language : தமிழ்
Breaking News
  •   

బంగాళాఖాతం ఏర్పడ్డ అల్పపీడన ధ్రోణి కారణంగా తమిళనాట భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెన్నైలోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అంతేకాదు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఉదయం నుండి తమిళనాడు వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. ప్రదానంగా చెన్నై నగరంలో కుండపోతగా కురిసిన వర్షం కారణంగా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా చెన్నైలో భారీ వర్షపాతం నమోదైంది. ఇక వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూతపడ్డాయి. ముందస్తు హెచ్చరికలు నేపధ్యంలో పగరంలోని పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలకు అప్రమత్తం చేసిన ప్రభుత్వం ముందస్తుగానే విద్యార్ధులను ఇళ్లకు పంపించాలని ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా పాఠశాలలకు విద్యార్ధుల భధ్రతపై ప్రభుత్వం పలు సూచనలు చేసింది. ఇక రానున్న 48గంటలు అతి భారీ వర్షాల కారణంగా అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేసిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సహాయక చర్యలపై దృష్టిసారించింది.

Videos